- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు బాబు వీరంగం.. పోలీసులను పరిగెత్తించి కొట్టాడు
దిశ, హుస్నాబాద్: గొడవలు జరుగుతున్న సమయంలో పోలీసులు వస్తే చాలా వరకు ఆకతాయిలు, రౌడీ షీటర్లు పరుగులు పెడుతారు. ఒకవేళ దొరికినా వదిలేయండి అంటూ బతిమిలాడుతారు. కానీ, మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. గొడవ జరుగుతోందని నిలువరించడానికి వచ్చిన పోలీసులనే పరిగెత్తించి.. పరిగెత్తించి కొట్టాడు. రక్తం వచ్చేలా కర్రలతో దాడి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కోహెడ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి వెలుగుచూసింది.
పూర్తి వివరాళ్లోకి వెళితే.. కోహెడ మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతోందని శుక్రవారం రాత్రి 100 డయల్‌కు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అధికారులు.. ఘటనా స్థలానికి వెళ్లాలని కోహెడ పోలీస్ స్టేషన్‌లో బ్లూకోట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్, లక్ష్మణ్ అలర్ట్ చేశారు. అనంతరం వెంటనే సదరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకోని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొడవకు ప్రధాన కారకుడు అయిన నజీమొద్దీన్.. మద్యం మత్తులో తనకే అడ్డు వస్తారా అంటూ ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై కర్రతో దాడి చేశాడు. పరిగెత్తించి మరి కొట్టాడు. ఏకంగా తలలు పగులగొట్టాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై రాజకుమార్ చెప్పారు. ప్రస్తుతం గాయపడ్డ బ్లూకోట్ కానిస్టేబుళ్లు కరీంనగర్‌లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.