బిపిన్ రావత్ మృతి పై అనుచిత పోస్టులు.. బెంగళూరు పోలీసులు ఏం చేశారంటే ?

by Anukaran |   ( Updated:2021-12-13 20:12:01.0  )
బిపిన్ రావత్ మృతి పై అనుచిత పోస్టులు.. బెంగళూరు పోలీసులు ఏం చేశారంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరణం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మరణ వార్త విని దేశం మొత్తం శోక సంద్రంలో నుంచి ఇంకా బయటకు రాలేదు. అయితే ఎవరైనా ఆయన మరణం పై అనుచితమైన పోస్టులు పెడితే కటకటాల పాలు చేస్తాం అని కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై హెచ్చరించాడు. అయితే అవేవీ పట్టించుకోని ఒక వ్యక్తి పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు.

దాంతో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని బెంగళూర్ పోలీసులు పట్టుకున్నారు. మైసూర్ కి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ఈ పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. ఇతడు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇతని పై ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. ఇంకో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story