ప్రధానిపై కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్..!

by Shamantha N |
ప్రధానిపై కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్..!
X

దిశ వెబ్‎డెస్క్: సోషల్ మీడియాలో ప్రధాని మోదీపై అసభ్యకర కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‎పై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఫేస్‎బుక్‎లో పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదురు వ్యక్తి ఒడిశాలోని కుసుంభీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒడిశా పోలీసుల సహయంతో శుక్రవారం అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed