APSP Constable : కలకలం సృష్టిస్తోన్న స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

by Bhoopathi Nagaiah |
APSP Constable : కలకలం సృష్టిస్తోన్న స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, ఏలూరు : రైలు కిందపడి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. సోమవారం ఉదయం ఈ షాకింగ్ విషయం వెలుగు చూడటంతో ఇటు ఆయన కుటుంబం, అటు పోలీస్ డిపార్ట్ మెంట్‌లో విషాద ఛాయలు అములుకున్నాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా కేంద్రంలోని రామకృష్ణపురం ప్రాంతానికి చెందిన పరమేశ్వరపు మధుబాబు కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఆయన ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి జేబులో సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలు నేపధ్యంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed