- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గోదాముకు వెళ్లిన వ్యక్తి అంతలోనే శవమై తేలాడు

దిశ, తిరుమలగిరి : వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు బోయినపల్లి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సై గిరిధర్ లు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన విశాల్ శంబాజీ పటేల్ అనే యువకుడు గత 2 నెలల క్రితం న్యూ బోయిన్ పల్లిలోని క్రాస్ రోడ్ లో గల మహమ్మద్ ఉస్మాన్ అనే పూలవ్యాపారి వద్ద పనికి చేరాడు. మృతుడు సోమవారం మధ్యాహ్నం గోడౌన్ కు వెళ్లి వస్తానని యజమానికి చెప్పి అక్కడి నుండి బోయిన్పల్లి లోని హనుమాన్ నగర్ లో గల గోడౌన్ కి వెళ్లి తిరిగి రాలేదు.
కాసేపటికి యజమాని మృతుడికి ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, మంగళవారం ఉదయం గోడౌన్ లో సామాను తీసుకురావడానికి వెళ్లిన జహంగీర్ కు విశాల్ శంబాజీ పటేల్ ఐరన్ స్టాండ్ కు ఉరివేసుకొని మృతి చెంది కనిపించాడు. అతను వెంటనే యజమానికి సమాచారం అందించాడు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి వెళ్లి చూసి పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.