- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) జోరుగా జరుగుతున్నాయి. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Civil Supply Minister Uttam Kumar Reddy) సమాధానం ఇస్తూ.. కొత్త రేషన్ కార్డులపై(New Ration Cards) కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన(BC Caste Census) ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి(Sankrathi) తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు(Applications) తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) జారీ చేయనున్నామని క్లారిటీ ఇచ్చారు. అంతేగాక రాష్ట్రంలో ఖాళీ అయిన రేషన్ డీలర్లను(Ration Dealers) వెంటనే భర్తీ చేయాలని ఇదివరకే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియ వెంటనే జరుగుతుందని, అలా జరగని పక్షంలో.. ఎక్కడ ఇబ్బందులు ఉన్నయో తెలియపరిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.