assembly: సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి

by Mahesh |
assembly: సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో రెండో రోజు ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ(bjp) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి(BJP MLA Katipalli venkata Ramanareddy) మాట్లాడుతూ.. తన కామారెడ్డి నియోజకవర్గం(Kamareddy Constituency)లో సర్పంచులకు సంబంధించి రూ. 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. గత, ప్రస్తుత ప్రభుత్వంలో అప్పు చేసి అభివృద్ధి పనులు చేశారని, వారు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో.. సర్పంచుల పరిస్థితి దారుణంగా ఉందని.. వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకులేని స్థితిలో ఉన్నారని.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏ ప్రభుత్వం అయినా సర్పంచులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని సభలో డిమాండ్ చేశారు. ఒక్క తన నియోజకవర్గంలోనే కాకుండా ప్రస్తుతం.. మంత్రులుగా ఉన్న వారి నియోజకవర్గాల్లోని సర్పంచుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని, సర్పంచులు ఏ పార్టీకి చెందిన వారు అయినప్పటికి.. వెంటనే నెల లోపు.. పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed