Trisha: మురుగన్ ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు.. పెళ్లి కోసమేనా అంటూ నెట్టింట చర్చ (వీడియో)

by Hamsa |
Trisha: మురుగన్ ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు.. పెళ్లి కోసమేనా అంటూ నెట్టింట చర్చ (వీడియో)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే స్టార్ హీరో సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర’(Vishvambhara) సినిమాలో నటిస్తుంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య 45(Surya 45) చిత్రంలోనూ చాన్స్ అందుకుంది. అయితే 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిష ప్రత్యేక పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కోయంబత్తూరు(Coimbatore)లోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(Murugan) (కుమారస్వామి) ఆలయానికి వెళ్లి స్వామి నేలపై కూర్చుని మరీ విశేష పూజలు నిర్వహించారు. ఇక అక్కడ ఆమెను చూసిన సాధారణ ప్రజలు ఫొటోలు తీపుకోవడానికి గుమిగూడారు. ఇక వారందరితో పిక్స్ దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం త్రిష పూజలు చేసిన ఫొటోలు(Photos), వీడియోలు వైరల్ అవుతుండటంతో అవి చూసిన వారంతా పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేసిందా? అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed