- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సువిశాలమైన భారత దేశానికి ఒకే రాజధాని ఎందుకు ఉండాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. నాలుగు మూలల్లో నాలుగు రాజధానులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్రిటీషర్లు కోల్‌కతా నుంచే యావత్ దేశాన్ని పాలించారని అన్నారు. కోల్‌కతా దేశ రాజధానిగా కొనసాగిందని తెలిపారు. ఢిల్లీ తర్వాత కోల్‌కతాను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రాజధానులను రొటేషన్ పద్ధతిలో వినియోగించుకోవాలని, నాలుగు రాజధానుల్లోనూ పార్లమెంటు సమావేశాలు జరగాలని అన్నారు.
దక్షిణాదిలో తమిళనాడు లేదా కర్ణాటక లేదా కేరళలో ఒక రాజధానిని, యూపీ లేదా పంజాబ్ లేదా రాజస్థాన్‌లలో మరో రాజధానిని, బీహార్ లేదా ఒడిశాలో లేదా బెంగాల్‌లో కోల్‌కతాను రాజధానిగా ఏర్పాటు చేయాలని, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఒక రాజధానిని నిర్మించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని శ్యామ్ బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన విషయాలను పంచుకున్నారు.
ప్లానింగ్ కమిషన్ పునరుద్ధరించాలి..
స్వాతంత్ర్య భారత్ కోసం నేతాజీ ప్లానింగ్ కమిషన్‌ను ఊహించారని దీదీ అన్నారు. నీతి ఆయోగ్‌తోపాటుగా ఈ కమిషన్‌ను కొనసాగించవచ్చునని, దీన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నేతాజీని రవీంద్రనాథ్ ఠాగూర్ దేశనాయక్ అని పిలిచేవారని, అందుకే నేతాజీ జయంతి రోజును దేశనాయక్ దివస్‌గా వేడుక చేసుకుంటున్నామని తెలిపారు. దేశనాయక్ దివస్‌ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని సూచించారు. కొందరిలాగా నేతాజీని కేవలం ఎన్నికల ముందే గుర్తుచేసుకోబోమని, ఏడాది పొడవూ తమ గుండెల్లో ఉంటారని అన్నారు. నేతాజీ కుటుంబంతో టచ్‌లోనే ఉంటున్నామని చెప్పారు.
e