- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా దగ్గర ఆయుధగారమే ఉంది: మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బీజేపీ అవమానించిందని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగాల్‌కు వచ్చినందుకు సంతోషమే. కానీ, నేతాజీ జయంత్యుత్సవంలో నేతాజీ, నేతాజీ అనే నినాదాలిస్తే ఆయనకు సెల్యూట్ చేసేదాన్ని. దానికి బదులు మీరు బెంగాల్‌ను, నేతాజీని అవమానించారు’ అని విమర్శలు సంధించారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంత్యుత్సవానికి ప్రధాని హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సీఎం మమతా బెనర్జీ ప్రసంగించడానికి వెళ్తుండగా కొందరు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఎగతాళి చేయాలని ప్రయత్నించారని ఆరోపిస్తూ నిరసనగా తన ప్రసంగాన్ని విరమించుకున్నారు. తాజాగా, ఆ కార్యక్రమాన్ని హుగ్లిలోని పుర్సురాలో ప్రస్తావించారు.
‘నేతాజీ దేశ, లోక నాయకుడు. ఆయన జయంతి వేడుకలకు వెళ్లాను. కానీ, అక్కడ కొందరు ఉన్మాదులు ప్రధాన మంత్రి సమక్షంలోనే నన్ను టీజ్ చేయడానికి ప్రయత్నించారు. వారికి నా గురించి తెలిసి ఉండదు. వాళ్లు ఆడవారిని చులకనగా చూస్తారు. సరే.. నన్ను వాళ్లింటిలో గిన్నెలు తోమమన్నా.. సంతోషంగా ఆ పని చేస్తా. అది ఆడవాళ్ల పని. పురుషుల పని కూడా. కానీ, నాపై గన్ గురిపెడితే, నా దగ్గర ఆయుధగారమే ఉన్నది. హింసను నేను నమ్మను. కానీ, రాజకీయాలను విశ్వసిస్తాను. అందుకే హింసనూ రాజకీయంగానే ఎదుర్కొంటాను’ అని అన్నారు. గతంలోనూ బీజేపీ నేతలు చేసిన తప్పులను ఆమె ఏకరువుపెట్టారు. ‘మీరు వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రబీంద్రనాథ్ ఠాగూర్ జన్మస్థానాన్ని తప్పుగా ప్రస్తావించారు. ఠాగూర్ నుంచి బిర్సా ముండా వరకు బెంగాల్ సాంస్కృతిక ఐకాన్లను మీరు అవమానించారు’ అని బీజేపీ నేతలపై విమర్శలు చేశారు.