- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు అన్యాయం: మల్లు రవి
దిశ, తెలంగాణ బ్యూరో : న్యాయ పోరాటం మాది.. తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్.. పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన వారంతా తిరిగి రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కోరారు. ఆదివారం ఆయన ఒక ప్రటకన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్యాయమని, వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారేమోననే భయంతో వాళ్లతో అవాక్కులు, చెవాక్కులు మాట్లాడించారని విమర్శించారు. ఎమ్యెల్యేలు పార్టీ మారిన అంశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం న్యాయబద్ధమైందని, ఆ అంశంపైన టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధ్యక్ష పదవి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా కార్యకర్తల అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే పార్టీ నిర్ణయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఉంటుందని, ఒక నియంత పాలనలో బతకాల్సిన అవసరం లేదన్నారు.