ఐదో వంతు తగ్గిపోనున్న షాపింగ్ మాల్స్ ఆదాయం!

by Harish |   ( Updated:2021-04-15 05:16:41.0  )
ఐదో వంతు తగ్గిపోనున్న షాపింగ్ మాల్స్ ఆదాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి ఆశించిన దేశంలోని షాపింగ్ మాల్స్ ఆదాయం కరోనా మహమ్మారికి ముందు స్థాయిలో ఐదో వంతు వరకు తగ్గే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. గతేడాది కరోనాతో 45 శాతం పడిపోయిన తర్వాత ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 55 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు క్రిసిల్ అభిప్రాయపడింది. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి షాపిక్ మాల్ కార్యకలాపాలా పనితీరు 80-85 శాతం మాత్రమే మెరుగవుతుందని తెలిపింది. ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ వల్ల షాపింగ్ మాల్స్‌లో రిటైల్ అమ్మకాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని, బలమైన స్పాన్సర్లు, మెరుగైన ద్రవ్యత కారణంగా రుణ సామర్థ్యం ప్రభావితమయ్యే ప్రమాదం లేదని క్రిసిల్ అంచనా వేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మొదటి 6 నెలల్లో రిటైల్ అమ్మకాలు కోలుకుంటాయని, ఈ అమ్మకాలు కరోనా ముందుస్థాయిలో 90 శాతానికి చేరువగా ఉండొచ్చని సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి అన్నారు. అమ్మకాలు మెరుగవడం ద్వారా షాపింగ్ మాల్స్ తమ అద్దేలను చెల్లించే ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని అనుజ్ తెలిపారు. 2020లో లాక్‌డౌన్ ఎక్కువ కాలంపాటు ఉండటంతో మాల్స్ మూసేయబడ్డాయని, దానివల్ల రిటైల్ అమ్మకాలు 55 శాతం వరకు పడిపోయాయి. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ఉన్న కరోనా ఆంక్షల వల్ల షాపింగ్ మాల్స్ మొత్తం ఆదాయం గణనీయంగా దెబ్బతినవచ్చని క్రిసిల్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed