ఫ్రాన్స్ హోటల్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో సెక్సీ బ్యూటీ.. త్వరలో చూస్తారంటూ..

by Shyam |   ( Updated:2021-11-10 03:55:01.0  )
Mallika-Sharavath-11
X

దిశ, సినిమా: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ మల్లికా శెరావత్ బాయ్ ఫ్రెండ్ గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘ది లవ్ లాఫ్ లైవ్’ షో ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అతని పేరు రివీల్ చేయని హాట్ బ్యూటీ.. తాము చాలా రోజుల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెప్పింది. టైం దొరికినప్పుడల్లా ఫ్రాన్స్ లో కలుస్తామని, ఎంత బీజీగా ఉన్నప్పటికీ ఒకరి కోసం ఒకరం టైమ్ కేటాయిస్తామని తెలిపింది.

‘ఎందుకంటే ప్రేమ అనే అనుభూతి చాలా విలువైనది. నాకు పబ్ కల్చర్ అంటే అసలు ఇష్టం ఉండదు. నేను ఆధ్యాత్మిక జీవనం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాను. నాకు నిద్రపోవటం అంటే బాగా ఇష్టం అందుకే తొందరగా పడుకుంటా. మేము ఫ్రాన్స్ హోటల్లో కలిసినప్పుడు నేను నిద్రపోదాం అంటే అతను ఓ మై గాడ్ నువ్వు పిచ్చిదానివా ? ఎల్లప్పుడూ పడుకునే ఉంటావు అంటూ సరదగా ఆట పట్టిస్తుంటారు’ అంటూ తన రిలేషన్‌షిప్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఆయన ఎవరని యాంకర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే సమాధానమిచ్చిన మల్లికా.. అతి త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నామని, అప్పుడే చూడమని చెప్పింది.

ఆ హీరోయిన్ నిశ్చితార్థపు ఉంగరానికి రూ.2 కోట్లు

Advertisement

Next Story