- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MBBS ఫుల్ ఫామ్ తెలియదు నాకు.. డెవలప్ కాలే: మంత్రి మల్లారెడ్డి
దిశ, కీసర: దేశంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేని వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంకా తృప్తి లేదా అంటూ ప్రశ్నించారు. కీసర మండల కేంద్రంలోని ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను బుధవారం జీపీఆర్ ఫంక్షన్ హాల్లో సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన జీవిత ఎదుగుదల గురించి ప్రస్తావించారు.
పాల వ్యాపారం నుంచి విద్యారంగంలో రాణించి.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎంతో మంది ఉపాధ్యాయులకు జీవనోపాధి కల్పిస్తున్నానని గుర్తు చేశారు. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా కష్టపడితే ఎమ్మెల్యే, మంత్రి, రాష్ట్రపతి కూడా కావొచ్చన్నారు. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ కూడా తెలియని తాను అభివృద్ధి కాలేదా అంటూ నిదర్శనంగా చూపించారు. అనంతరం జిల్లాలోని 34 మంది ఉపాధ్యాయులను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డిలు మొమెంటో అందచేసి సన్మానించారు.