శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా దారుణం.. కాళ్లు, చేతులు విరిగి..!

by Sumithra |
శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా దారుణం.. కాళ్లు, చేతులు విరిగి..!
X

దిశ, మహమ్మదాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో వ్యక్తి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కావడమే కాకుండా చూసేందుకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోని మహమ్మదాబాద్ మండలం నంచర్ల గేట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద సుమారు 11 గంటల ప్రాంతంలో గురువారం సాయంత్రం వెలుగుచూసింది.

ఎస్ఐ రవిప్రకాశ్ కథనం ప్రకారం.. దోమ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (55) మహమ్మదాబాద్ మండల పరిధిలోని కంచన్ పల్లి గ్రామానికి పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో నంచర్ల గేట్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో వ్యక్తి కాళ్లు, చేతులు విరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందడంతో బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవిప్రకాశ్ తెలిపారు.

Advertisement

Next Story