తండ్రిగా గర్వపడుతున్నా: మెగాస్టార్ మోహన్‌లాల్

by Jakkula Samataha |
తండ్రిగా గర్వపడుతున్నా: మెగాస్టార్ మోహన్‌లాల్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోకి నటీనటుల వారసులు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో నిలదొక్కుకునే వారు కొంతమంది మాత్రమే. తెలుగులో ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో డెబ్యూ అయ్యారు. ఈ విధంగా హీరోల కుమారులు హీరోలుగా, కూతుర్లు హీరోయిన్లుగా వచ్చేస్తున్న తరుణంలో..కొందరు మాత్రమే భిన్న నేపథ్యమున్న రంగాల్లోకి వెళ్తుంటారు. అలా భిన్న రంగంలోకి వెళ్లి ఉన్నత స్థానానికి రీచ్ అయితే వారి తల్లిదండ్రులకుండే ఆనందం వేరేలా ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ అలానే చేసింది. సినీ ఇండస్ట్రీ కాకుండా క్రియేటివ్ రైటింగ్ సైడ్ వెళ్లి..తన తండ్రి గర్వపడే మొమెంట్ క్రియేట్ చేసింది.

‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ పేరుతో విస్మయ రాసిన పుస్తకం ప్రజెంట్..మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ తన కూతురు రాసిన పుస్తకాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. తన కూతురు రాసిన బుక్‌ ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ను ఈ నెల 14న రిలీజ్ కాబోతున్నదని ప్రకటించేందుకు తాను తండ్రిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం-2’ మూవీ ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Advertisement

Next Story