- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్ర పరిశ్రమలో విషాదం.. యంగ్ హీరోయిన్ శరణ్య మృతి
దిశ, వెబ్‌డెస్క్: మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఒక యువనటి ప్రాణాలు విడిచింది. ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (35) కన్నుమూశారు. గతకొన్నేళ్ళుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరణ్య మలయాళ సీరియళ్ల తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంత్రకోడి, సీత, హరిచందనం వంటి సీరియల్స్ ఆమెను స్టార్ హీరోయిన్ గా చేశాయి. ఇక జీవితం గాడిన పడి పలు చిత్రాల్లో కూడా సహాయ పాత్రలు చేస్తున్న సమయంలోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఒక్కసారిగా ఆమె కుంగిపోయారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పదకొండు పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్న శశి.. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక అప్పట్లో మలయాళ ఇండస్ట్రీ మొత్తం శరణ్య కు అండగా ఉంటూ తమ వంతు సాయం అందించగా ఆమె కొంచెం కోలుకున్నారు. ఇక ఇటీవల శరణ్య కరోనా బారిన పడడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కేరళ త్రివేండ్రంలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో జాయిన్ అయ్యారు. న్యూమోనియాతో పాటు రక్తంలో సోడియం స్థాయిలు పడిపోవటంతో కొన్నిరోజులగా చికిత్స తీసుకుంటున్న శరణ్య ఆరోగ్యం విషమించి సోమవారం కన్నుమూశారు. 35 ఏళ్ల వయస్సులో యువనటి మృతిచెందడంతో మాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. శరణ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.