కాలా షూటింగ్‌లో ఘోర ప్రమాదం..

by Anukaran |   ( Updated:2020-10-07 07:11:37.0  )
కాలా షూటింగ్‌లో ఘోర ప్రమాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : మలయాళ నటుడు టోవినో థామస్ తీవ్రంగా గాయపడ్డారు. ‘కాలా’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన.. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కడుపు భాగంలో గాయం కాగా.. తీవ్ర నొప్పితో బాధపడుతున్న తనను కొచ్చిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది మూవీ యూనిట్. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి వదంతులు నమ్మరాదని కుటుంబ సభ్యులు అభిమానులకు సూచించారు. ప్రస్తుతం తనను 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు.. ఆ తర్వాతే తన ఆరోగ్యం గురించి తెలపనున్నారు.

రోహిత్ వి.ఎస్. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కాగా.. ‘గోధ, మారి 2, అభియుమ్ అనువుమ్’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టోవినో. మలయాళీ చిత్రం ఫోరెన్సిక్‌లో చివరగా కనిపించిన ఆయన మిన్నల్ మురళి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed