- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ అంత ఈజీ కాదు.. నరకం అనుభవించా! : మలైకా
దిశ, సినిమా : ఫిట్‌నెస్ లేడీ మలైకా అరోరా తన కొవిడ్ రికవరీ స్టోరీ షేర్ చేసింది. ఆ సమయంలో హెల్త్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన మలైకా.. జీవితంలో చాలా విషయాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, కానీ లక్ అనేది మాత్రం తన లైఫ్‌లో స్మాల్ రోల్ ప్లే చేసిందని తెలిపింది. అందుకే కరోనాబారిన పడ్డానని చెప్పింది. కొవిడ్ రికవరీ గురించి మాట్లాడే ఎవరైనా… గొప్ప రోగనిరోధక శక్తితో ఆశీర్వదించబడతారు లేదా హెల్త్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటారని చెప్తుంటారని తెలిపింది. అయితే తన విషయంలో మాత్రం అంత ఈజీ కాదని చెప్పింది.
కొవిడ్ తనను శారీరకంగా విచ్ఛిన్నం చేసిందని, నీరసంతో రెండు అడుగులు కూడా వేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పింది. కిటీకి దగ్గర నిల్చోవాలని కోరుకున్న అలా చేయలేకపోయానని.. ఆ సమయంలో బరువు పెరిగాను, బలహీనంగా మారానని తెలిపింది. కుటుంబానికి దూరంగా ఉంటూ నరకం అనుభవించానని, దేవుడి దయ వల్ల 21 రోజుల తర్వాత నెగెటివ్ వచ్చిందని చెప్పింది. నమ్మకం అనే పదం తనను ముందుకు నడిపిందని, దాదాపు 32 వారాల తర్వాత తాను పూర్తిగా నార్మల్ కాగలిగానని చెప్పింది.