హీరోయిన్ డేటింగ్.. తల్లి కావాలనుకుంటున్న ఐటెమ్ బాంబ్

by Shyam |
హీరోయిన్ డేటింగ్.. తల్లి కావాలనుకుంటున్న ఐటెమ్ బాంబ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మరోసారి తల్లి కావాలనుకుంటోంది. అర్బాజ్ ఖాన్‌- మలైకా దంపతులకు అర్హాన్ కొడుకు కాగా.. ఈ ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం తన కన్నా 11ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్న భామ.. అర్హాన్‌తో పాటు ఓ ఆడపిల్లకు జన్మనిస్తే బాగుండేది అనుకునేదట. కానీ ఇప్పుడు ఓ అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని.. తనకు ఫ్యామిలీ, ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీనిపై కొడుకు అర్హాన్‌తో కూడా చర్చిస్తుంటానని.. కానీ ఎప్పుడు? ఎలా? జరుగుతుందనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పింది. అయితే తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ మలైకా మంచి మనసుకు కుదోస్ చెప్తున్నారు నెటిజన్లు. కాగా ఇప్పటికే రవీనా టాండన్, సుస్మితా సేన్, మందిరా బేడీ లాంటి సీనియర్ హీరోయిన్స్ అమ్మాయిలను అడాప్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed