- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘క్రీడాకారులకు కరోనా సోకదు’
దిశ, మక్తల్: క్రీడాకారుల్లో శరీరదారుడ్యం, రోగ నిరోదక శక్తి మెండుగా ఉండటంతో వారికి కరోనా రాదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టేం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని మినిస్టేడియంలో మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు గవినోళ్ళ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం మాట్లాడుతూ…
తాను కూడా క్రీడాకారున్నే అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నానని ఎమ్మెల్యే వెల్లడించారు. కరోనా విపత్తులో ప్రజలంతా కుదేలైన వేళ, మేమున్నామని సేవలు అందించిన వైద్య సిబ్బందికి, పోలీసులకు, మున్సిపాలిటీ కార్మికులకు సన్మానం చేశారు. ప్రతిఒక్కరూ వ్యాయామం, యోగా లాంటివి నిత్యం చేస్తూ, రోగ నిరోదక శక్తి పెంచుకోవాలని అన్నారు. ధ్యాన్ చంద్ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని కోరారు.