ఆ హామీల అమలు కోసమే ఛలో అసెంబ్లీ…

by Shyam |
ఆ హామీల అమలు కోసమే ఛలో అసెంబ్లీ…
X

దిశ, నారాయణఖేడ్ : గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశ్ రాథోడ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బంజారా భవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ… జిల్లా నుంచి లంబాడీ సోదరులు ,విద్యార్థులు, మేధావులు, పోడు రైతులు భారీ ఎత్తున హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో గిజనులకు 6 నుండి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ తన మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. కాబట్టి ప్రభుత్వం పై లంబాడీ ప్రజలు యుద్దానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన తండా గ్రామ పంచాయతీ‌లను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలన్నారు. వాటి అభివృద్ది కోసం 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని LHPS మరియు GVS ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం చెపట్టామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed