మహీంద్రా కంపెనీ షాక్.. రికార్డ్ స్థాయిలో ‘ఎక్స్‌యూవీ 700’ బుకింగ్స్

by Harish |
Mahindra XUV700
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 700 మోడల్ కోసం రికార్డు బుకింగ్స్‌ను సాధించింది. ఈ మోడల్ కోసం బుకింగ్ ప్రారంభమైన కేవలం గంటలోనే 25,000 బుకింగ్‌లు సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. ఊహించని స్థాయిలో ఎక్స్‌యూవీ 700 కొనుగోలు కోసం బుకింగ్స్ రావడంతో ఆశ్చర్యంలో ఉన్నామని కంపెనీ అభిప్రాయపడింది. ఇంత తక్కువ వ్యవధిలో భారత మార్కెట్లోని ఏ వాహనం(ఫోర్‌వీలర్) కూడా ఇన్ని బుకింగ్స్ సాధించలేదని, మొదటి వాహనం ఎక్స్‌యూవీ 700 కావడం సంతోషంగా ఉందని మహీంద్రా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశీయంగా వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం తిరిగి బుకింగ్‌ను మరో 25,000 వాహనాల కోసం పునఃప్రారంభించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కాగా, ప్రస్తుతానికి బుక్ అయిన 25 వేల వాహనాలను ధర రూ. 11.99 లక్షల వద్ద సంస్థ విక్రయించింది. శుక్రవారం విక్రయించే వాటి ధరలు రూ. 50 వేలు అధికంగా రూ. 12.49 లక్షల వద్ద ప్రారంభమవుతాయని, 57 నిమిషాల్లో 25 వేల బుకింగ్‌లను సాధించడం గర్వంగా ఉందని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈఓ విజయ్ నక్రా వెల్లడించారు.

Advertisement

Next Story