- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
430 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 430 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మహేశ్వరం మండల పరిధిలోని ఐడీఏ మంఖల్ వద్ద ఓ గోడౌన్‌లో 860 సంచుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం నిల్వ ఉన్నట్టు సివిల్ సప్లయ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హైదర్ అలీఖాన్‌కు సమాచారం అందింది. పోలీసుల సహకారంతో ఆయన పీడీఎస్ బియ్యం నిల్వ చేసిన గోడౌన్ పై దాడులు చేశారు. 860 బస్తాల్లో నింపిన 430 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరు అక్రమార్కులు ప్రజల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటినే తిరిగి అధిక రేటుకు పేద ప్రజలకు చట్ట విరుద్ధంగా విక్రయించడం, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు గోడౌన్‌లో నిల్వ ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులు రత్లావత్ గణేష్, సింగం సతీష్ కుమార్, గుబ్బా అనిల్, కాగుల శ్రీనివాస్ యాదవ్, కొర్ర శంకర్‌లను అరెస్టు చేశారు.ఘటనా ప్రాంతంలో ఉన్న నాలుగు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఈ మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డిని, ఎస్బీ ఏసీపీ జావేద్‌ను, ఇబ్రహీంపట్నం క్రైమ్ ఏసీపీ యాదగిరిరెడ్డిని, మహేశ్వరం ఇన్‌స్పెక్టర్ డి.వెంకన్న నాయక్‌ను రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహేష్ భగవత్ అభినందించారు.