ఘట్టమనేని బర్త్‌డేకు మహేశ్, జక్కన్న కొత్త ఘట్టం

by Shyam |   ( Updated:2020-05-13 08:45:34.0  )
ఘట్టమనేని బర్త్‌డేకు మహేశ్, జక్కన్న కొత్త ఘట్టం
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తారక్, చరణ్‌లతో మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తి కాగా.. జక్కన్న తర్వాతి చిత్రంపై కాన్సంట్రేట్ చేశాడు. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని చెప్పిన రాజమౌళి.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాడు. మే 31న సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ పుట్టినరోజు కాగా.. ఈ తేదీ మహేష్‌కు చాలా స్పెషల్. దీంతో ఆ రోజే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతేకాదు సినిమా కాస్ట్ అండ్ క్రూతో పాటు టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ వాయిదా పడగా… సినిమా విడుదల జనవరి 8 నుంచి జూలైకి పోస్ట్‌పోన్ కానుందట. ఆ తర్వాతే మహేష్ బాబుతో షూటింగ్ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed