Jr NTR's ఎవరు మీలో కోటీశ్వరులు గ్రాండ్ ఫినాలేకి సూపర్ స్టార్..

by Shyam |   ( Updated:2021-11-22 01:05:00.0  )
Jr NTRs ఎవరు మీలో కోటీశ్వరులు గ్రాండ్ ఫినాలేకి సూపర్ స్టార్..
X

దిశ సినిమా: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్నా ఎవరు మీలో కోటీశ్వరులు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంటుంది. అయితే క్షణం క్షణం ఉత్కంఠ బరితంగా ఉండే ఈ షో మరింత ఉత్కంఠ పెంచుతుంది. ఫైనల్‌ ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథిగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నారని సమాచారం. ఈ షోను ప్రసారం చేస్తున్న ఛానెల్ మహేష్ బాబు ఎపిసోడ్‌ను స్పష్టం చేసింది. ఈ వారంలో ఫైనల్ ఎపిసోడ్ స్పెషల్ క్లైమాక్స్ టీజర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే దీనిపై అఫీషియల్స్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఈ సీజన్‌ గ్రాండ్ ముగింపులో సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక వైపు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అలరించనున్నారు. మహేష్ బాబు కూడా రానున్న ఫైనల్ ఎపిసోడ్‌లో రూ.25 లక్షలు వరకు గెలుచుకోనున్నట్లు సమాచారం. రాబోయే ఆ స్పెషల్ ఎపిసోడ్‌ గురించి మరిన్ని వివరాలు త్వరలో అందజేయనున్నారు. ఇటీవలే ఈ షోలో మొదటి కోటీ రూపాయలు గెలుచుకున్న వ్యక్తికి పట్టాభిషేకం చేసింది. హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల పోలీసు రాజా రవీంద్ర రూ.1 కోటీ మంగళవారం ఎపిసోడ్‌లో గెలుచుకున్నారు. అయితే అతను ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మొట్ట మొదటి రూ. కోటి గెలుచుకోని కోటీశ్వరుడయ్యాడు.

ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి, శివ కొరటాల, సమంతా, దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి చాలా మంది ప్రముఖలను ఆహ్వానించారు. మార్చిలో ప్రకటించిన ఈ కార్యక్రమం ఆగస్ట్ 22న గ్రాండ్‌గా కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో రామ్ చరణ్‌ను మొదటి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఎవరు మీలో కోటీశ్వరులు డిసెంబర్ మొదటి వారంలో ముగిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed