బాలయ్యతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు మరి : మహేష్ బాబు

by Shyam |   ( Updated:2021-12-05 22:36:30.0  )
బాలయ్యతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు మరి : మహేష్ బాబు
X

దిశ, సినిమా: ‘అఖండ’ సినిమాతో బాక్సాఫీసు రికార్డులు షేక్ చేస్తున్న బాలయ్య… ఇటు ఆహా లోనూ అదరగొట్టేస్తున్నాడు. థియేటర్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అన్‌స్టాపబుల్ అంటూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే’ హోస్ట్‌గాను ప్రేక్షకులచే సూపర్బ్ అనిపించుకున్న బాలయ్య బాబు.. ఫోర్త్ ఎపిసోడ్‌ గెస్ట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబును ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా… మహేష్ దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.

‘బాలయ్య బాబుతో నా ఈవినింగ్ టైమ్ అద్భుతంగా ఎంజాయ్ చేశాను’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు తారక్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ గెస్ట్‌గా హాజరైన ప్రిన్స్.. ఇప్పుడు బాలయ్య షోకు కూడా అటెండ్ కావడం ఆనందంగా ఉందంటున్నారు. ఇక బాలయ్య-ప్రిన్స్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసిన మహేష్ అభిమానులు.. తమ ఆనందానికి అవధులు లేవని చెబుతున్నారు.

వసుంధర అలా చేయమని ప్రామిస్ తీసుకుంది.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed