సమంతను టార్గెట్ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్.. చిక్కుల్లో సామ్.?

by Anukaran |   ( Updated:2021-12-16 00:05:59.0  )
సమంతను టార్గెట్ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్.. చిక్కుల్లో సామ్.?
X

దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో, అన్నే విమర్శలు కూడా వస్తున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో నెటిజన్లు సమంతని తప్పు పడుతున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకుంటామని ప్రకటించిన తర్వాత సామ్ వరస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి వావ్ అనిపించుకుంటుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ఎవరి నోట చూసిన ఊ అంటావా.. అంటూ పాడుతున్నారు.

అయితే ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ప్రశంసలతో పాటు సామ్‌కి విమర్శలు కూడా అన్నే వస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పురుష సంఘం ఈ పాటలో లిరిక్స్ పురుషులపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్నాయంటూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సమంతపై కూడా కేసు పెట్టారు. ఇక ఇదిలా ఉంటే సామ్‌పై మహేష్ బాబు అభిమానులు విరుచుకుపడుతున్నారు. నువ్వు చేస్తే ఒకటి మా అభిమాన నటుడు మహాష్ బాబు చేస్తే తప్పుగా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయితే 2014లో విడుదలైన నేను ఒక్కడినే సినిమాలో ఓ సాంగ్‌లోహీరోయిన్ కృతిస‌న‌న్‌, మ‌హేష్ కాళ్లను ఫాలో అవుతున్నట్లు ఓ సీన్ ఉంటుంది. దీనిపై అప్పట్లో సామ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అయితే ప్రస్తుతం పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ రీసెంట్‌గా సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సాంగ్‌లో సమంత ఓ బిట్‌లో వ్యక్తి గుండెలపై కాలు పెట్టి స్టెప్పులేసింది. మ‌హేష్ ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడు మహేష్ బాబును అన్నారు.. ఇప్పుడు మీరు చేసేది ఏంటి అంటూ విరుచుక పడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

Advertisement

Next Story