రాముడిగా.. మహేశ్ అందం వర్ణించతరమా!

by Jakkula Samataha |
రాముడిగా.. మహేశ్ అందం వర్ణించతరమా!
X

జగదభి రాముడైన.. శ్రీ రామచంద్రమూర్తి పాత్రలో ఎంతో మంది నటులను తెరపై చూసుంటాం. అబ్బా.. రాములోరిగా ఎంత బాగా సెట్ అయ్యాడో అనుకుని సంతోషపడి ఉంటాం. ఆ నీలమేఘశ్యామున్ని ఎంత మంది నటుల్లో చూసుకున్నా తనివితీరని భక్తులు.. సూపర్ స్టార్ మహేశ్‌బాబులో రామున్ని చూసుకుని కచ్చితంగా సంతృప్తి పొందుతారని బల్లగుద్ది చెప్తున్నారు ఫ్యాన్స్. అదేంటి మహేశ్ రాముడి పాత్ర ఎప్పుడు చేశారు.. ఏ సినిమాలో చేశారు అనుకుంటున్నారా? తాజాగా కిరణ్ అనే వీరాభిమాని తన అభిమాన హీరో మహేశ్‌ను రాముడిగా తీర్చిదిద్దాడు . బహుశా రాముడు ఇలాగే ఉంటాడేమో అన్నంత అందంగా పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇంతకీ మహేశ్‌ను రాముడి రూపంలోనే ఎందుకు ఊహించుకున్నారు అనేందుకూ ఓ కారణం ఉందండోయ్. అదే.. దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో తర్వాతి సినిమా ప్రకటించడమే. ఒకవేళ ‘జక్కన్న ప్రిన్స్ హీరోగా రామాయణం తీస్తే.. రాముడిగా మహేశ్ అందాన్ని వర్ణించతరమా’ అంటూ ఈ ఫ్యాన్‌మేడ్ పోస్టర్‌ను అభిమానులకు కానుకగా ఇచ్చాడు. దీంతో ఈ పిక్ కాస్త సోషల్ మీడియాలో వైరలైంది.

కాగా మే 31న మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై అధికారిక ప్రకటన వెలువడనుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అదే రోజున మహేశ్ – పరశురామ్ సినిమాపైనా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రానుందని సమాచారం.

Advertisement

Next Story