సీఎం జగన్‌కు మహేశ్ బాబు, నాగబాబు కృతజ్ఞతలు

by srinivas |
సీఎం జగన్‌కు మహేశ్ బాబు, నాగబాబు కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమ కార్మికులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు నటులు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అంతేగాకుండా మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘‘గౌరవనీయులైన సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం హర్షణీయం! విపత్కర సమయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ థాంక్యూ. సినిమా మళ్లీ ట్రాక్‌లో పడుతోంది’’ అని సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీరితో మరో నటుడు మంచు మనోజ్, దర్శకులు పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed