మరో ఇంటెన్స్ రోల్‌లో శర్వా..

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ గురించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా చేయబోతున్నాడు శర్వా. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు.

‘గమ్యం, ప్రస్థానం’ లాంటి చిత్రాల తర్వాత మరో ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్న శర్వా.. ఈ క్యారెక్టర్ ప్లే చేసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపారు. పవర్‌ఫుల్ స్క్రిప్ట్, సూపర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న లవ్ అండ్ యాక్షన్ సినిమా ద్వారా ఆడియన్స్‌కు సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు అజయ్ భూపతి. ప్రాజెక్ట్ గురించి ప్రతీవారం సర్‌‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు హామీ ఇచ్చారు. కాగా సినిమాలో సిద్దార్థ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ సర్‌ప్రైజ్‌ లిస్ట్‌లో సిద్ధు ఉంటాడేమో చూడాలి.

Advertisement