- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుక్ హెల్ప్.. మహారాష్ట్ర థాంక్స్
కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. ఇతరులను టచ్ చేసినా మనకి కరోనా సోకుతుందనే భయంలో ఉన్నారు జనాలు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. మరి అలాంటి వారికి ప్రొటెక్షన్ ఇవ్వడం మన బాధ్యత అని … మన ప్రాణాలు కాపాడే వారి ప్రాణ రక్షణ మరింత ప్రాధాన్యం అని… నిర్ణయించుకున్నారు షారుక్. ఈ క్రమంలోనే covid 19 తో పోరాడుతున్న వైద్యుల కోసం 25, 000 పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ (PPE) కిట్స్ ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన మహారాష్ట్ర ఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి రాజేష్ తోపే… మీరు అందించిన సహాయం కరోనా పై పోరాటానికి సపోర్ట్ గా ఉంటుందని… మనల్ని కాపాడేందుకు కరోనా తో ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణగా ఉంటుందని తెలిపారు.
Thank you sir for all your help to source the kits. We are all together in this endeavour to protect ourselves and humanity. Glad to be of service. May your family & team be safe and healthy. https://t.co/DPAc7ROh7i
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2020
దీనిపై స్పందించిన షారుక్ .. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు మనమంతా ఒక్కటిగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్న షారుక్… మీ కుటుంబం, టీం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
Tags: Sharuk Khan, Mahrashtra, Bollywood, CoronaVirus, Covid19