- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నవలఖాకు కళ్లద్దాల తిరస్కరణపై దర్యాప్తు
by Shamantha N |
X
ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసు నిందితుడు గౌతం నవలఖాకు ఆయన కుటుంబీకులు పంపిన కళ్లద్దాలను వెనక్కి పంపించిన ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దర్యాప్తునకు ఆదేశించారు. తలోజా జైలులో ఉన్న నవలాఖ కళ్లజోడు నవంబర్ 27న చోరీకి గురైందని, అవి లేకుంటే ఆయనకు దాదాపు కంటి చూపు కనిపించదని కుటుంబసభ్యులు తెలిపారు. అందుకే ఈ నెల కొత్త కళ్లద్దాలను పార్శిల్‌లో పంపితే జైలు అధికారులు స్వీకరించకుండా వెనక్కి పంపారని వివరించారు. ఇలాంటివాటిని మానవతాదృష్టితో చూడాలని, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. అందుకే దర్యాప్తునకే ఆదేశించారని వివరించారు. ఈ విషయంపై మానవత్వం అవసరమని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానిస్తూ ఖైదీల అవసరాలపై సున్నితంగా నడుచుకునే జైలు అధికారులకు వర్క్‌షాప్ నిర్వమించాలని సూచించింది.
Advertisement
Next Story