- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పోలీసులు సేవలు అమూల్యమైనవి’
దిశ, క్రైమ్ బ్యూరో : దేశంలో తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో ఉండగా, శాంతి భద్రతల పరిరక్షణలో హైదరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ స్పోర్ట్స్ మీట్ గోషామహాల్ పోలీస్ స్టేడియంలో మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… కరోనా సమయంలో పోలీసులు సేవలు అమూల్యమైనవి అని కొనియాడారు.
పోలీసులకు క్రీడలు తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ఉండాలని సూచించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… క్రీడలు మనందర్నీ ఒక జట్టుగా ఉండేలా చేయడమే కాకుండా, మన మధ్య స్నేహాన్ని పెంచుతాయని అన్నారు. చట్టాలను అమలు చేసే క్రమంలో ప్రజల్లో విశ్వాసనీయతను పెంచేందుకు ప్రతి పోలీసుకు శారీరక దృఢత్వం అవసరం అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలని అన్నారు.