- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసిన మొదటి జిల్లా
దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసిన మొదటి జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయమని కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. మంగళవారం ఆయన డీటీవో కార్యాలయంలో ఈ -ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని కార్యకలాపాలు ఈ-ఆఫీస్‌లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో కాగిత రహిత పరిపాలన నిర్వహించేందుకు ఈ-ఆఫీస్ ఒక్కటే శరణ్యమని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మూడేండ్ల క్రితమే ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారని, మహబూబ్‌నగర్‌తో పాటు నారాయణపేట జిల్లాలో కూడా అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక మండల స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ 13 మండలాల్లో కార్యాలయాలు ఈ-ఆఫీస్ విధానం కిందికి తీసుకువచ్చామని, ఈ నెల 15న మరో రెండు కార్యాలయాల్లో ఈ విధానం ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు వరకూ జిల్లామొత్తం ఈ విధానంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆగస్టు 1 నుంచి అన్ని కార్యాలయాలలో ఈ-ఆఫీస్‌లో పనిచేసేలా చూస్తామని తెలిపారు. దీని వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు, పారదర్శకత, ఫైలులో తీసుకున్న నిర్ణయాలు బయటకి పొక్కకుండా ఉండడంతోపాటు, ఫైల్ ఎక్కడ ఉందో సులువుగా కనిపెట్టే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.