- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'శారదక్కా లొంగిపో.. స్వాగతం పలుకడానికి సిద్ధంగా ఉన్నాం'
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ ఇటీవల కరోనా తో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గురువారం మృతుని కుటుంబ సభ్యులును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటి రెడ్డిమాట్లాడుతూ.. హారిభూషన్ భార్య సమ్మక్క అలియాస్ శారదా కరోనా తో ప్రాణాపాయ స్థితిలో ఉందని, జనజీవన స్రవంతి లోకి రావాలని కుటుంబ సభ్యులను కోరారు. కరోనా బారిన పడి ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారన్న ఎస్పీ తల్లిదండ్రులను చివరి చూపు చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
సమ్మక్క అలియాస్ శారదా, కుటుంబ సభ్యుల ద్వారా గాని, మీడియా ముందు గాని, పోలీసుల ద్వారాగాని, పౌరహక్కుల సంఘం నాయకుల ద్వారా గాని మధ్య వర్తిత్వంతో ప్రభుత్వానికి లొంగిపోతే.. ప్రభుత్వం మరియు పోలీసు శాఖ స్వాగతం పలుకుతుందని అన్నారు. లొంగిపోయిన వారికి జీవనోపాధి కల్పించడంతో పాటు వారిపైనే ఉన్న రివార్డు అందిస్తామన్నారు. లొంగిపోయిన తర్వాత మిగతా జీవితం కూడా బాగా ఉండే విధంగా చూసుకునేలా పోలీస్ శాఖ హామీ ఇస్తున్నట్లు తెలిపారు.కరోనా వైరస్ , ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు భేషజాలకు వెళ్లకుండా లొంగిపోవాలని కోరారు. లొంగిపోతే మానవీయ కోణంలో వైద్యం అందిస్తామని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ యోగేష్ గౌతమ్ , సీఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.