వామ్మో ఇదేం సమ్మె.. ఏకంగా ఆరువేల మంది సస్పెండ్.. అయినా..

by Anukaran |
వామ్మో ఇదేం సమ్మె.. ఏకంగా ఆరువేల మంది సస్పెండ్.. అయినా..
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పై కొరడా ఝూపించింది. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వం లో విలీనం చేయాలని అక్కడి యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. నెల రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. అయితే కార్మికులు చేస్తున్న సమ్మెను ఎంఎస్ఆర్టీసీ సీరియస్ గా తీసుకుంది. కష్టకాలంలో ఇలా సమ్మెకు దిగడం సబబుకాదని చెప్పినా కార్మికులు దిగిరాలేదు. దాంతో శనివారం ఏకంగా 3,011 మందిని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకో 272 మందిని ఆదివారం తొలగించినట్టు ప్రకటించింది. దాంతో ఇప్పటి వరకు దాదాపుగా 6,278 మందిపై దీని ప్రభావం పడింది.

కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మహా సర్కార్ మరో అవకాశాన్ని ఇచ్చింది. సమ్మెను ముగించి తక్షణమే విధుల్లో చేరితే అందరినీ వెనక్కి తీసుకుంటామని, లేక పోతే మరింత మంది పై వేటు తప్పదని హెచ్చరించింది. దాంతో 92,267 మంది ఉద్యోగుల్లో దాదాపు 18 వేల కు పైగా తిరిగి విధుల్లో చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 252 డిపోలకు గాను 51 ని పునరుద్ధరించామని మిగిలినవి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed