తమిళనాడు రెండో రాజధానిగా మధురై

by Anukaran |   ( Updated:2020-12-14 07:48:23.0  )
తమిళనాడు రెండో రాజధానిగా మధురై
X

చెన్నై: మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ ఎంజీఆర్ కలలను ముందుకు తీసుకెళ్తుందని, తమిళనాడు రెండో రాజధానిగా మధురైని ఏర్పాటు చేయాలని ఆయన భావించేవారని కమల్ హాసన్ అన్నారు. మధురైలోని కమరాసర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాల్‌లో ఆయన మాట్లాడుతూ, ఎంఎన్ఎం అధికారంలోకి వస్తే మధురై తమిళనాడుకు రెండో రాజధాని అవుతుందని తెలిపారు. మధురై తిరుగుబాటు జ్ఞాపకార్థం నగరానికి ఆ పేరు పెట్టినట్టు గుర్తుచేశారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ‘ఎంఎన్ఎం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఎంఎన్ఎం యువత ఇంటింటికి వెళ్లి ప్రజలకు చేరువవ్వాలి. మనం రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. పాలన మనదే. రేపటి భవిత మనదే. అవినీతి నిర్మూలన ఒక్కరితో సాధ్యమయ్యే పనికాదు. కానీ, ప్రజల చేయూతతో ఇది కచ్చితంగా సాధ్యమవుతుంది. మేం అవినీతి నిర్మూలించి తీరుతాం’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed