- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలి.. మాదిగ జేఏసీ డిమాండ్
by Shyam |

X
దిశ, చండూరు: తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వందకు పైగా కేసులు పెట్టినా, అణిచి వేయాలని చూసినా ఆంధ్రా ప్రభుత్వానికి తలొగ్గకుండా.. చుక్కలు చూపించిన విద్యార్థి నాయకులు డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నల్గొండ జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కూరపాటి సుదర్శన్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రభుత్వం వందలాది కేసులు పెట్టినా ఏనాడూ వెనకడుగు వేయకుండా, జైలు జీవితం సైతం అనుభవించి, కేసీఆర్ వెన్నంటే ఉన్నాడని అన్నారు. పిడమర్తి రవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story