MLC Addanki Dayakar : బండి సంజయ్‌ని ఎవరికైనా చూపించండి : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

by M.Rajitha |
MLC Addanki Dayakar : బండి సంజయ్‌ని ఎవరికైనా చూపించండి : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP)కి ఎవరూ దొరకనట్టు బండి సంజయ్(Bnadi Sanjay) నే ఎందుకు కేంద్రమంత్రిని చేశారో వారికే తెలియాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) విమర్శించారు. దయచేసి ఆయనను త్వరగా ఎవరికైనా చూపిస్తే అందరికీ మంచిదన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి దేశ భక్తులు, దేశ ద్రోహులు కూడా ఎవరో తెలియదని ఇలాంటి వాళ్ళను ఎంపీలుగా చేసి కేంద్రప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలని అనుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి కోసమే పోటీ పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. త్వరగా ఆ పదవి ఎవరికో ఒకరికి ఇస్తే వీళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నాను అన్నారు. సన్నబియ్యం అనే క్రెడిబిలిటీ అనేది కాంగ్రెస్ దక్కుతుందని అద్దంకి స్పష్టం చేశారు.

దేశం మొత్తం మీద పేదలకు సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. దేశంలో ఆహారభద్రత పథకాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ ఘనతే అని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇచ్చి అప్పుడు బండి సంజయ్ మాట్లాడాలని సూచించారు. రాష్ట్రానికి ఏవైనా నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి కేంద్రంతో కొట్లాడాలి కాని ఏ పనీ చేయకుండా పేర్ల కోసం కొట్లాడే పంచాయితీ మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాలకు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పేర్లను పెట్టే దమ్ము ఉందా అని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు.

Next Story