వెళ్లి చావండి.. పేరెంట్స్‌కు ఉచిత సలహా ఇచ్చిన విద్యాశాఖ మంత్రి

by Shamantha N |
వెళ్లి చావండి.. పేరెంట్స్‌కు ఉచిత సలహా ఇచ్చిన విద్యాశాఖ మంత్రి
X

భోపాల్: మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. పాఠశాలల్లో ఫీజులు దండుకుంటున్నారని, వాటిని తగ్గించాలని అభ్యర్థించడానికి వెళ్లిన ఓ పేరెంట్స్ యూనియన్‌తో అసభ్యంగా మాట్లాడారు. వాళ్లు ఫీజులు తగ్గించకుంటే ‘వెళ్లి చావండి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సదరు మంత్రి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అతన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుమారు 100 మంది తల్లిదండ్రుల సభ్యులున్న మధ్యప్రదేశ్ పాలక్ మహాసంగ్ ఫీజులు విషయంపై మాట్లాడటానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అధికార నివాసానికి వెళ్లారు. కరోనా సమయంలో ఫీజులు తగ్గించి కేవలం ట్యూషన్ ఫీజులే తీసుకోవాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పాఠశాల యాజమన్యాలు బేఖాతరు చేస్తున్నాయని, ఇందులో జోక్యం చేసుకోవాలని మంత్రి పర్మార్‌ను కోరారు. ఒకవేళ స్కూల్ ఎడ్యుకేషన డిపార్ట్‌మెంట్ ఫీజుల తగ్గింపును నిరాకరిస్తే ఎలా అని యూనియన్ సభ్యులు మంత్రిని అడిగారు. దీంతో మంత్రి సీరియస్ అయ్యారు. ‘వెళ్లి చావండి. మీరేం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ కటువుగా సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలపై యూనియన్ సభ్యులు సహా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed