పవన్ ఐడియాలజీ సూపర్ : మాధవీ లత

by Jakkula Samataha |
పవన్ ఐడియాలజీ సూపర్ : మాధవీ లత
X

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే అభిమానులకు సూపర్ పవర్స్ వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. జనసేనానికి ఆ రేంజ్‌లో డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీ నుంచి కూడా తనకు వీరాభిమానులు ఉన్నారు. తనను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇండస్ట్రీకి ఎంటరై, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందుకు యంగ్ హీరో నితిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ కాగా.. తను అంతకు మించి అని చెప్తూ ఉంటుంది హీరోయిన్ మాధవీ లత.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవీ లత.. పవర్‌స్టార్ అంటే తనకు చాలా పిచ్చి ఉండేదని చెప్పింది. 17 ఏళ్ల నుంచే తనకు ఫ్యాన్ అయిపోయానని చెప్పిన ఈ తెలుగు హీరోయిన్.. కాలేజీకి వెళ్లే రోజుల్లో తన గది మొత్తం పవన్ ఫొటోలతో నిండిపోయేదని చెప్పుకొచ్చింది. వాళ్లమ్మ తన రూమ్ చూసి.. ‘ఇందులో ఒక్కదానివి ఉన్నట్లు అస్సలు లేదు.. నలుగురు ఐదుగురు ఉన్న ఫీలింగ్ కలుగుతోందని’ చెప్పేదని తెలిపింది మాధవి. పవన్ ఐడియాలజీ చాలా ఇష్టమన్న భామ.. ఫ్యూచర్‌లో బీజేపీ, పవన్ కలిసి దేశాన్ని ముందుకు నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్తోంది. ఈ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేసింది మాధవి.

Advertisement

Next Story