- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్పైరింగ్ ఉమన్ మెకంజీ స్కాట్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి వేలాది మంది జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది. ఈ కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వగా.. ఆ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పాండమిక్ టైమ్‌లో నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకుంటున్నాయి. పెద్ద మనసున్న కొందరు బిజినెస్‌మెన్ సైతం పలు రంగాలను ఆదుకునేందుకు డొనేషన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న మహిళలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు మెకంజీ స్కాట్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య అయిన మెకంజీ.. గత నాలుగు నెలల్లో సుమారు రూ.30 కోట్ల విరాళాలు అందించారు. తన సంపదలో అత్యధిక భాగం చారిటీకే ఇస్తానని గతేడాది ‘గివింగ్ ప్లెడ్జ్’ పేరిట ప్రతిజ్ఞ చేశారు మెకంజీ.
కరోనా అమెరికన్ల జీవితాల్ని దుర్భరం చేసేందని, అయితే ఇదే సమయంలో కోటీశ్వరుల సంపద అనూహ్యంగా 80% మేర పెరిగిందని మెకంజీ పేర్కొంది. అందుకే ప్రజలకు సాయంగా నిలుస్తున్న 384 స్వచ్ఛంద సంస్థల్ని గుర్తించి ఆర్థికసాయం అందిస్తున్నానని తెలిపింది. ఇలా ఆకలి, పేదరికాన్ని దూరం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూ మెకంజీ సమాజానికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది. అయితే ఇన్ని డొనేషన్లు చారిటీకి ఇచ్చేసిన ఆమె వద్ద ఇంకా సుమారు రూ.4.1 లక్షల కోట్లు ఉండటం విశేషం.