‘మానాడు’ ప్రీలుక్ స్టోరీ

by Shyam |
‘మానాడు’ ప్రీలుక్ స్టోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: శింబు హీరోగా వస్తున్న ‘మానాడు’ సినిమాపై స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేసింది మూవీ యూనిట్. పాలిటిక్స్ నేపథ్యంలో వస్తున్న మూవీ ప్రీలుక్ రిలీజ్ చేసిన టీం..నవంబర్ 21న ఉదయం 10.44 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని తెలిపింది. ఒంటరిగా అయినా సరే నిజం వైపు నిలబడు అనే క్యాప్షన్‌తో రిలీజ్ అయిన ప్రీలుక్‌లో శింబు నమాజ్ చేస్తూ కనిపించగా.. తన ముందే రివాల్వర్..చుట్టూ పొలిటికల్ లీడర్స్ కటౌట్స్.. ప్రచారం..ఘర్షణలో గాయపడిన ప్రజలు భయంతో పరుగెత్తుతూ కనిపిస్తున్నారు.

కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. డైరెక్టర్ ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రేమ్ జీ అమరేన్, ఎస్ఏ చంద్రశేఖర్, భారతీ రాజా, మనోజ్ భారతీరాజా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న సినిమాకు రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్.

ఈ మధ్య రిలీజైన శింబు ‘ఈశ్వరన్’ ఫస్ట్ లుక్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. ‘మానాడు’ ఫస్ట్ లుక్ అంతకు మించిన హైప్ తీసుకొచ్చేలా ఉంది. ప్రీలుక్‌లోనే సినిమాపై భారీ అంచనాలు పెంచిన డైరెక్టర్ వెంకట్ ప్రభు..డిజాస్టర్లతో అలిసిపోయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శింబుకు బ్లాక్ బస్టర్ ఇచ్చేలాగే ఉన్నాడు అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story