- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ పరిష్కారాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్‌టీ) ఇన్ఫోటెక్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. మొత్తం 1.11 లక్షల చదరపు అడుగుల భవనాన్ని కంపెనీ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 3,000 మంది పనిచేస్తారని, ఈ సెంటర్ నుంచే డిజిటల్, క్లౌడ్, డేటా పరిష్కారాల విభాగాన్ని నిర్వహించనున్నట్టు, ఇక్కడి నుంచే అంతర్జాతీయంగా తమ క్లయింట్లకు సేవలందించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దీనికోసం సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ వారితో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో కొత్త కంపెనీలకు అవసరమైన డిజిటల్ ప్రాముఖ్యతనిస్తూ ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్ సీఓఓ నచికెత్ దేశ్‌పాండే ‘ గ్లోబల్ టెక్నాలజీ విభాగంలో హైదరాబద్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ విస్తారమైన నైపుణ్యం కంపెనీలకు లభిస్తుంది. ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రోత్సాహకాల ద్వారా తాము కొత్త కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఇక్కడి నుంచే కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ వృద్ధిని ఆశిస్తున్నామని’ వెల్లడించారు.