- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమించి పెళ్లి చేసుకుంటే, కుటుంబ సభ్యులు విడదీశారు…
దిశ,మానకొండూరు: చావును సైతం లెక్క చేయను.. భర్తే కావాలంటూ ఓ యువతి భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే… ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన దళిత యువతి సంధ్యారాణికి, శంకరపట్నం మండలం ఇప్పలపల్లె గ్రామానికి చెందిన అన్నే లక్ష్మీ కుమారుడైన అన్నే సంతోష్ అనే వ్యక్తి హైదరాబాదులో పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో4 సంవత్సరాలు ప్రేమించుకొని 2020 మార్చిలో ఇల్లంతకుంట పోలీసుల ఆధ్వర్యంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీరాములపల్లెలో నాలుగైదు మాసాలు సంతోషంగా ఉన్న వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ తరుణంలో సంతోష్ కుటుంబ సభ్యులు బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో దళిత వర్గానికి చెందిన సంధ్యారాణిని వదిలించుకునీ రమ్మని సంతోష్‌ను అనేక ఇబ్బందులకు గురి చేశారని సంధ్యారాణి తెలిపింది. వారి వేధింపులు భరించలేక పోలీసులను కూడా ఆశ్రయించినట్లు వెల్లడించింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల బలంతో దళిత వర్గానికి చెందిన తనను సంతోష్ నిరాకరిస్తున్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని సంధ్యారాణి కోరుతుంది. సమాచారం తెలుసుకున్న కేశవపట్నం బ్లూ కోట్ పోలీసులు సూర్యతేజ, రవి ఇప్పలపల్లెకు చేరుకొని కేశపట్నం పోలీస్ స్టేషన్‌కు సంధ్యారాణిని తరలించారు.