- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ వీడియో.. నా కూతురినే ప్రేమిస్తావా.. నడిరోడ్డుపై సుత్తి, ఇనుప రాడుతో..
దిశ, వెబ్‌డెస్క్ : తన కూతురిని ఓ యువకుడు ప్రేమించాడని.. సదరు యువతి.. తండ్రి, సోదరుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇనుప సుత్తి, రాడుతో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ భావ్సర్(22), మక్సి నగరానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు.
వీరిద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి రావాలని కోరారు. ఈ క్రమంలో వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. అయితే ముందు నుంచి యువతి కుటుంబ సభ్యులకు పుష్పక్ అంటే ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పుష్పక్ కటింగ్ షాప్‌లో కటింగ్ చేసుకుంటున్న సమయంలో యువతి తండ్రి, అన్న ఒక్కసారిగా షాప్ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చారు.
మక్సీ వీధిలో వెంబడించి మరీ సుత్తి, ఇనుప రాడ్‌తో పుష్పక్‌పై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో పుష్పక్ కాలు, చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడి అనంతరం యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి, అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై దాడి చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ये बर्बरता है, शाजापुर जिले के मक्सी में प्रेम प्रसंग के चलते एक युवक के साथ लड़की के परिजनों ने बीच बाजार बेरहमी से मारपीट की, हथौड़े से ! @ndtv @ndtvindia pic.twitter.com/JhsoVgrYW8
— Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2021