ప్రేమ, పెళ్లి .. చివరికి ఇంట్లో అలా కనిపిస్తూ..

by Anukaran |   ( Updated:2021-10-27 23:19:12.0  )
ప్రేమ, పెళ్లి .. చివరికి ఇంట్లో అలా కనిపిస్తూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : కలకలాం కలసి ఉందాం అనుకున్న జంటను కాలం విడదీసింది. వారి ప్రేమ, పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంట అకస్మాత్తుగా విగతజీవులుగా మారిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రేమ జంట అనుమానాస్పదంగా మృతిచెదడం కలకలం సృష్టిస్తోంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

జిల్లాలోని రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీష్ దివ్య అనే ఇద్దరు యువతీ యువకులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి ప్రేమ మారిపోయింది. దీంతో ఎలాగైనా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. వీరు ఇంటి నుంచి పారిపోయి విశాఖపట్నంలోని ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంతలో ఏమైందో తెలియదు గానీ ఈ ప్రేమజంట ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వీరు ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఎవరైనా హత్య చేసి ఫ్యాన్‌కు వేలాడ దీశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నవ దంపతులు మరణిచడంతో ఆగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story