లాస్ ఏంజెల్స్ 2028 లోగో విడుదల

by  |
లాస్ ఏంజెల్స్ 2028 లోగో విడుదల
X

దిశ, స్పోర్ట్స్ : 2028లో లాస్ ఏంజెల్స్ (Los Angeles) వేదికగా నిర్వహించనున్న ఒలింపిక్స్, పారా ఒలంపిక్స్ (Olympics, Paralympics) క్రీడల లోగోను నిర్వాహకులు విడుదల చేశారు. ‘ఎన్నటికీ మారుతూ ఉండే A’ అంటూ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ లోగోలోని ‘ఏ’ అక్షరాన్ని అభిమానులు, ఇతర సంస్థలు తమకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

ఏ (A) అక్షరం ద్వారా అనేకమైన కథనాలు సృష్టించుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత డిజిటల్ తరానికి తగ్గట్లుగా లోగోను సిద్ధం చేసినట్లు.. లాస్ ఏంజెల్స్‌కు సంబంధించి ఎన్నో కథలు ఈ లోగో ద్వారా రాబోయే కాలంలో వివరిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన లోగో వైరల్‌గా మారింది. ఈ ఏనిమిది ఏళ్లలో లాస్ ఏంజెల్స్ (Los Angeles) లోగోను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన ‘ఏ’ డిజైన్ నిర్వాహకులు పంపవచ్చు. వీటిలో ఆసక్తికరంగా ఉండే దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తారు.


Next Story

Most Viewed