లారీ అడిగి హత్యకు గురయ్యాడు

by Sumithra |   ( Updated:2020-02-17 07:09:39.0  )
లారీ అడిగి హత్యకు గురయ్యాడు
X

పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు లారీ ఓనర్ హత్యకేసును ఛేదించారు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీసు స్టేషన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాడేపల్లిగూడెంకి చెందిన నార్ని వెంకటేశ్వరరావుకు రెండు లారీలకు యజమాని. తాడేపల్లిగూడెంకి చెందిన దంతలూరి మణికంఠ వర్మ అభ్యర్థన మేరకు ఆయన ఒక లారీ ఫైనాన్స్‌కి ష్యూరిటీ సంతకం పెట్టాడు. ఐదు నెలలు గడిచినప్పటికీ ఒక్కనెల ఫైనాన్స్ కూడా మణికంఠ వర్మ చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ సంస్థ వెంకటేశ్వరరావుకి నోటీసులు పంపింది.

వెంకటేశ్వరరావు, మణికంఠ నివాసానికి వెళ్లి డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో లారీ తీసుకెళ్లిపోతానని బెదిరించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న మణికంఠ వర్మ తన ముగ్గురు మిత్రులతో పథకం రచించి ఈ నెల 7న వెంకటేశ్వరరావును హతమార్చి ఏలూరు కాలువలో పడేశారు. మరుసటి రోజు మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం నార్నే వెంకటేశ్వరరావుదిగా గుర్తించి, పోస్టు మార్టం తరువాత కుటుంబ సభ్యులకు అందజేశారు. దర్యాప్తు అనంతరం ప్రధాన నిందితుడు దంతలూరి మణికంఠ వర్మ, అతనికి సాయమందించిన షేక్‌ అరాఫత్‌, పట్నాల వెంకటేశ్వరరావు, కోటి సాయిబాలాజీలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed